logo

ఏకలవ్య మోడల్ స్కూల్ విద్యార్థులకు అస్వస్థత ఆసుపత్రికి తరలింపు..

ఏకలవ్య మోడల్ స్కూల్ విద్యార్థులకు అస్వస్థత ఆసుపత్రికి తరలింపు..
గాంధారి: మోడల్ స్కూల్ విద్యార్థులకు అస్వస్థతకు గురికావడంతో ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ప్రిన్స్ పాల్ మాత్రం.. ఎగ్జామ్స్ ఉన్నాయని ఒత్తిడితో అస్వస్థకు గురయ్యారటూ చెప్పుకొచ్చారు. కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని ఏకలవ్య మోడల్ స్కూల్‌లో చదువుతున్న ఐదుగురు విద్యార్థులకు అస్వస్థకు గురై హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటన సోమవారం రాత్రి సమయంలో చోటుచేసుకుంది. విద్యార్థులు మధ్యాహ్నం భోజనం తిన్న తర్వాత కొందరికి కడుపు నొప్పి, తల నొప్పిగా ఉందని చెప్పడంతో సాయంత్రం హుటాహుటిన ఏకలవ్య మోడల్ స్కూల్ సిబ్బంది ప్రైవేట్ హాస్పిటల్‌కి తరలించారు. ఒక పేరెంట్ ముందుకు వచ్చి ఆదివారం తన పిల్లవాడిని చూసేందుకు వచ్చినప్పుడు విద్యార్థులకు సరిపడా గుడ్లు లేవని దాదాపు 100 గుడ్లు అందులో కొన్ని పాడైపోయినవి కలవడం వల్ల విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయిందని ఒక పేరెంట్ తండ్రి స్వయానా మీడియాకు తెలపడం జరిగింది. చికిత్స పొందుతున్న విద్యార్థులు 7, 8వ తరగతి విద్యార్థులే కావడం గమనార్హం. ఇందులో శిరీష, గౌతమి, నందిని, హరిత, సోనాక్షి, ఉన్నారు. ప్రస్తుతం ఐదుగురు విద్యార్థులకు హాస్పిటల్‌లో సెలైన్ బాటిల్ ఎక్కిస్తున్నారు. ఏకలవ్య మోడల్ స్కూల్ ప్రిన్సిపల్‌ను, హాస్టల్ వార్డెన్లను వివరణ కోరగా పరీక్షల ఒత్తిడి కారణంగానే ఇలా జరిగిందని సమాధానం చెబుతున్నారు. కానీ 8వ తరగతి చదువుతున్న తమ యొక్క బాబు సాయి హర్షవర్ధన్‌కు వాంతులు అవుతున్నాయని స్వయానా స్కూల్ అధ్యాపకులు పేరెంటుకు ఫోన్ చేసి చెప్పారు. తప్పు ఎక్కడ జరిగిందో ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని పేరెంట్స్ కోరుతున్నారు. ఇలాంటి చర్యలు జరగకుండా దీనికి సంబంధించిన అధికారులపై తగు చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

34
943 views